Heavy Rains In khammam District: భారీ వర్షాలకు పరవళ్లు తొక్కతున్న గోదారమ్మ..

Heavy Rains In khammam District: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం. భారీ వర్షాలకు పరవళ్ళు తొక్కుతున్న గోదారమ్మ.

Update: 2020-08-16 10:31 GMT

Heavy Rains In khammam District: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం. భారీ వర్షాలకు పరవళ్ళు తొక్కుతున్న గోదారమ్మ. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి.. గోదావరికి ఉపనదులు తోడై బ్రిడ్జిల ప నుండి కుగా ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో భద్రాచలంలో రెండో ప్రమాద హేచ్చేరిక జరీ చేసారు. ప్రస్తుతం భద్రాచలంలో 50.6 అడుగులకు చేరిన నీటిమట్టం. భద్రాచలం రామాలయాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద నీరు. తాలిపేరు ప్రోజేక్ట్ల్ లోకి భారీగా చేరుకున్న వరద నీరు. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.

అంతే కాదు, అల్పపీడన ప్రభావంతో ఏపీలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి ధవళేశ్వరంలో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు. జలదిగ్బందంలో లంక గ్రామాలు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో పొంగి పొర్లుతున్న శబరీ నది. వరద నీటిని సముద్రంలోకి విదుల చేస్తున్న అధికారులు. మూడు రోజులుగా ఏపీ రాష్ట్రం ముసురుకున్నట్టే కనిపిస్తోంది. కనీసం బయటకు వెళ్లేందుకు అర గంటపాటు సమయం లేకుండా నిరంతరం కురుస్తూనే ఉంటోంది. ఇదే పరిస్థితి మరో రెండు, మూడు రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వీటి ప్రభావంతో రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనివల్ల అవసరాలు ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం వల్ల తీవ్రత మరింత పెరుగుతుందని, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.


Full View



Tags:    

Similar News