తెలంగాణలో భగ్గమంటున్న భానుడు..

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు.

Update: 2020-05-25 10:19 GMT

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువై పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండతీవ్రతను తట్టుకోలేక ఎండదెబ్బకు గురవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు ప్రజలను బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

మరో నాలుగైదు రోజులు ఎండ త్రీవత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతున్నాయని పేర్కొంది. రాజస్థాన్‌ నుంచి విదర్భ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయని స్పష్టం చేసింది. దీని వలన ఈ రోజున పలు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకావశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిన్న ఆదిలాబాద్‌ జిల్లాలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

చత్తీస్ ఘడ్ నుంచి ఇంటిరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ధ్రోణి కొనసాగుతుందని తెలిపారు. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జిల్లాల్లో ఈ రోజు, రేపు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.




 


Tags:    

Similar News