బీఫారం దక్కలేదని టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

Update: 2020-01-14 06:01 GMT
బీఫారం దక్కలేదని టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కని కొందరు ఆశావహులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తమకు టికెట్‌ వస్తుందని ఆశించిన కొందరు తీరా టికెట్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురికాగా, మరికొందరు మాత్రం సూసైడ్‌ అటెంప్ట్‌ చేస్తున్నారు. మేడ్చల్ పురపాలక సంఘం14వ వార్డులో బీఫామ్‌ ఇవ్వలేదని విజయ్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశాడు. అయితే తనకు టీఆర్ఎస్ బి-ఫారం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. అయితే చివరికి వేరే అభ్యర్థికి బి-ఫారం ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఈ ఉదయం చేరుకొని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై విజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆయనకు నచ్చజెప్పారు.

Tags:    

Similar News