పట్టణాలు ప్రగతి నిలయాలుగా మారాలి: మంత్రి సత్యవతి రాథోడ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తరవాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే.

Update: 2020-02-25 12:27 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తరవాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలోనే మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఈస్ట్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా పట్టణాలను అభివృద్ది చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిలో స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు నిర్మించాలని అధికారులకు తెలిపారు. మున్సిపాలిటీలు అంటే మురికికూపాలు కాదని వాటిని అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఇప్పటి వరకూ మున్సిపాలిటీలను అవినీతి నిలయాలుగా ప్రజలు అనుకుంటున్నారని, ఇప్పటి కైనా ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఆ నిందపోగొట్టాలని అధికారులకు తెలిపారు. పట్టణాలు అంటే ప్రగతి నిలయాలుగా మార్పు చెందాలని అందుకు అధికారులు ఎంతో కృషి చేయాలని ఆమె అన్నారు.

పల్లెల నుంచి ఎంతో మంది బతుకు దెరువుకోసం పట్టణాలకు వస్తారని, అలాంటి వారికి మౌలిక అవసరాలు తీర్చే విధంగా మన పట్ట ప్రణాళిక ఉండాలనేది సీఎం ఆలోచన అని అన్నారు. పట్టణాల్లో ఉన్న అవసరాలను తీర్చే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా పట్టణ ప్రగతి నిర్వహించుకోవాలన్నారు. కాలనీలలో ఉండే మురికి కాలువలు ఏరోజుకారోజు శుభ్రం చేయాలన్నారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను వెంటనే తీర్చాలని అధికారులకు తెలిపారు. ఎవరైనా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. 

Tags:    

Similar News