లోతైన బావిలోపడ్డ నక్క.....బయటకు తీసిన ఫారెస్ట్ సిబ్బంది

Update: 2019-07-06 07:56 GMT

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని బావిలో నక్క పడింది. ముందుగా దీన్ని గ్రామస్తులు కుక్కగా భావించారు. తర్వాత బావిలో పడింది నక్క అని తెలుసుకుని ఫారెస్ట్ ఆఫీసుకు సమచారం అందించారు. లోతైన బావిలో పడ్డ నక్కను ఫారెస్ట్ సిబ్బంది తాళ్ల సాయంతో బయటకు తీశారు. వెంటనే నక్కను జాలిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. నక్కపడ్డ బావి నీటిని ఏడు రోజుల పాటు తాగరాదని కాట్రపల్లి గ్రామస్తులు నిర్ణయించారు. 

Tags:    

Similar News