బండి సీజ్ అయిన వాహనదారులకి శుభవార్త

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ వింధించిన సంగతి తెలిసిందే. ఎవరు బయటకు రాకుండా ప్రభుత్వాలకి సేకరించాలని కోరాయి.

Update: 2020-05-08 07:21 GMT

కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ వింధించిన సంగతి తెలిసిందే. ఎవరు బయటకు రాకుండా ప్రభుత్వాలకి సేకరించాలని కోరాయి.అయినప్పటికీ కొందరు మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా రోడ్లపైకి వాహనాలపై వస్తుండడంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించారని పోలీసులు కేసులు నమోదు చేసి వారి వాహనాలని సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన వాహనాలను విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వాహనాలపై ఇప్పటి వరకూ నమోదైన చలాన్స్ చెల్లించుకొని విడుదల చేయనున్నారు తెలంగాణ పోలీసులు.

అయితే మొదటిసారిగా చాలన్ల పడిన వాహనాలపై sec 179 కింద కేసు నమోదు చేసి, సుమారు 500 రూపాయలను జరిమానా చెల్లించి వాహనాలను తీసుకెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ జరిమానాను ఫోన్ పే, గూగుల్ పే, మీ సేవ ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే sec 188 ఐపీసీతో పాటు 207 ఐపీసీ కేసు నమోదు చేసి ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు సీజ్ చేసిన వాహనాలు కోర్టుకి వెళ్లి తీసుకోవాలి వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సుమారుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇందులో లక్షకు పైగా సివిల్ పోలీసులు కేసులు నమోదు చేయగా, 60 వేలకు పైగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం.. ఇక లక్షకు పైగా వాహనాలు ఒక్క హైదరాబాద్ లోనివేనని తెలుస్తోంది.  

Tags:    

Similar News