Telangana Budget 2020: ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్తను తెలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కళను నిజం చేయడానికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2020-03-08 10:56 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మరో శుభవార్తను తెలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కళను నిజం చేయడానికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ నిధుల కొరత వలన ఈ పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో పూర్తి కాకుండా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,73,763 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఆగి ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు.

2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నటీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. దీంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేక పోయింది. 2019 ఎన్నికల హామీలో భాగంగా సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని టీఆర్ఎస్ మానిఫెస్టోలో పొందుపరిచింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో లక్ష ముంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసేందుకు రూ. 11,917 కోట్లు కేటాయించింది.

ప్రస్తుంతం ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం దాదాపు రూ. 5 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తుందని తెలిపింది. స్థలం ఉన్న వారికి, శిథిలావస్థలో ఇండ్లు ఉన్న వారు పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో సొంత ఇంటి కళ పూర్తి చేసుకోవాలనుకున్న వారు నిశ్చింతగా పూర్తి చేసుకోవచ్చు.

Tags:    

Similar News