నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Update: 2019-01-07 03:07 GMT

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రధానంగా శాసనసభ సమావేశాల నిర్వహణ, ఇతర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ప్రగతి భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది.

ఈ నెల 17వ తేదీ నుంచి మొదటి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. ఇక దీనిపై కేబినెట్‌ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో అత్యల్పంగా మంత్రులు పాల్గొంటున్నారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కోసం ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్‌కు మళ్లీ నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Similar News