వెంటనే విధుల్లో చేరండి : సబితా ఇంద్రా రెడ్డి

ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించుకుని విధుల్లో చేరాలని, డిమాండ్లేమైనా ఉంటే ఉద్యోగాల్లో చేరిన తరువాత చర్చించాలని మంత్రి సబితా నిరసనకారులను కోరారు.

Update: 2019-11-11 02:47 GMT
Minister Sabitha Indra Reddy

జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి చుక్కెదురైంది. ఆమె జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో కొంత మంది ఆర్టీసీ కార్మికులు మంత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. యాలాల జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లాకు వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ముందు నిరసనలను చేపట్టారు. నెల రోజుల నుంచి సమ్మెలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కార్మికులను, జేఏసీ నాయకులను చర్చలకు పిలవలేదని కర్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరపాలని లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం పై మంత్రి సబిత మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులను సమ్మెను విరమించుకుని విధుల్లో చేరాలని, ఏమైనా డిమాండ్లు ఉంటే ఉద్యోగాల్లో చేరిన అనంతరం వాటి గురించి చర్చించాలని మంత్రి నిరసనకారులను కోరారు.  



Tags:    

Similar News