నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్నారు.

Update: 2019-12-22 03:13 GMT
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈయన డిసెంబర్ 28 వరకు భాగ్యనగరంలో బస చేయనున్నారు. ఈ నేపథ‌్యంలోనే ఆదివారం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళి సై విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాత్రి 7.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి సహా తెలంగాణ సీఎం కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా రాజ్ భవన్ వద్ద ఏర్పాట్లు సాగుతున్నాయి. భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా అధికారులు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రముఖులు అందరూ పాల్గొనాలని గవర్నర్ కోరారు. ఏటా దక్షిణాది రాష్ట్రాల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రతిఏటా ‍‍హైదరాబాద్ లోని బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు రాష్ట్రపతి. హైదరాబాద్ చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

తమిళిసై గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. 23న రాష్ట్రపతి తిరువనంతపురం పర్యటనకు వెళ్లనున్నారు. 27న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. 28న హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం పట్టనున్నారు.

Tags:    

Similar News