జూబ్లీహిల్స్‌ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. 9 మందికి గాయాలు

Update: 2019-06-17 03:32 GMT

హైదరాబాద్ జుబ్లీహిల్స్‌ పబ్‌లో బౌన్సలర్లు రెచ్చిపోయారు. 9మంది యువకులపై బౌన్సలర్లు దాడి చేశారు. మిత్రుని పుట్టిన రోజు వేడుకలకు పబ్‌కు వెళ్లిన వారు వాష్ రూమ్‌లో చేతులు తుడుచుకునేందుకు నాప్కిన్ బాక్స్‌ లాగగా నాలుగు నాప్కిన్‌లు కిందపడ్డాయి. దీంతో బౌన్సలర్లు బూతులు తిట్టారు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బౌన్సర్లు తోటి బౌన్సర్లతో కలిసి 9 మంది యువకులపై దాడి చేశారు. బాధితులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పబ్ యాజమాన్యాన్ని బౌన్సర్లను ప్రశ్నించినట్లు సమాచారం. 

Full View

Tags:    

Similar News