ప్రార్థన సమయానికి రాని సర్కార్ బడి పంతుళ్ళుకు చెక్..

ప్రభుత్వ పాఠశాలలో ప్రార్ధన సమయానికి రాని బడి పంతుళ్లు చెక్ పెట్టేందు విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అందరు డీఈవోలు, ఎంఈవోలు శుక్రవారం నుండి వారి వారి పరిధిలో ఉన్న సర్కారు బడుల ప్రార్ధన సమయానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది.

Update: 2019-08-23 07:01 GMT

ప్రభుత్వ పాఠశాలలో ప్రార్ధన సమయానికి రాని బడి పంతుళ్లు చెక్ పెట్టేందు విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అందరు డీఈవోలు, ఎంఈవోలు శుక్రవారం నుండి వారి వారి పరిధిలో ఉన్న సర్కారు బడుల ప్రార్ధన సమయానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఆదేశాలమేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం డీఈవోలు, ఎంఈవోలు ఏ ఏ సర్కార్ బడికి వెళ్లారో.. ఎన్ని గంటల సమయానికి స్కూల్ ప్రార్ధన జరిగింది.. ఏమైన లోపాలు కానీ గుర్తించారా ఇతరతర విషయలపై ఉదయం 11గంటలోపు నివేదిక ఇవ్వలని కమిషనర్ ఆదేశించారు.

అయితే చాలా మంది ప్రభుత్వ పాఠశాల టీచర్స్ సరైనా సమయానికి రావడంలేదని చాలా ఫిర్యాదులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. కాగా, ఈ సరికొత్త నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్ల యూనియన్లు స్వాగతిస్తున్నాయి. ఇక ప్రతి శనివారం.. ప్రతి పాఠశాల ప్రార్ధన సమయం లేదా ఆటల సమయంలో ఓ వీఐపీ పాల్గొనేలా చూడాలని డీఈవోలు, ఆర్జేడీలను విద్యాశాఖ కమిషనర్ విజయ్‌‌కుమార్‌‌ ఆదేశించారు. సమస్యల పరిష్కారం, అధికారుల సమన్వయం కోసం జిల్లా కలెక్టర్‌‌, ఎస్పీ, డీఎస్పీ, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ తదితరులను పాఠశాలకు ఆహ్వానించాలన్నారు. ఉత్తర్వులను స్కూల్ హెడ్మాస్టర్లు అమలు చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News