నేతన్నకు ఆర్థిక వెసులుబాటు.. అందుబాటులోకి ఎన్ని కోట్లో తెలుసా...

పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతణ టీఎస్‌ఐఐసీ కేంద్ర కార్యాలయంలో హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ శాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలపై శనివారం సమీక్ష నిర్వహించారు.

Update: 2020-05-23 12:57 GMT

పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతణ టీఎస్‌ఐఐసీ కేంద్ర కార్యాలయంలో హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ శాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలపై శనివారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నకు చేయూత పొదుపు పథకంలో చేరిన వారికి లబ్ధి చేకూరనుంది అని ఆయన అన్నారు. ఈ పథకంలో భాగంగా గడువు పూర్తి కాకముందే నగదు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తక్షణమే నేతన్నలకు నగదు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే రూ.93 కోట్లను నేతన్నలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా సుమారుగా 26,500 మంది నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. అంతే కాక కష్టంలో బతుకునీడుస్తున్న వారికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని పేర్కొన్నారు.

నేతన్నల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్నారు. వారి కష్టాల్లో, సుఖాల్లో రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని, నేతన్నలకు మంచి కాలం వస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో పాటు వారి ఉత్పత్తులకు డిమాండ్‌ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ హాజరయ్యారు.




 


Tags:    

Similar News