సాహస వీరుడు..ఎద్దు తోక పట్టుకొని..

అది దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ కొండలు వాగులు ఆదివాసీలు తప్ప ఇంకెవరూ వెళ్లలేని ప్రాంతమది అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు ఎక్కడైనాచిక్కుకుంటే ఇక అంతే సంగతులు ఇక వర్షాకాలమైతే ఇక చెప్పనక్కర్లేదు

Update: 2019-08-09 11:34 GMT

అది దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ కొండలు వాగులు ఆదివాసీలు తప్ప ఇంకెవరూ వెళ్లలేని ప్రాంతమది అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు ఎక్కడైనాచిక్కుకుంటే ఇక అంతే సంగతులు ఇక వర్షాకాలమైతే ఇక చెప్పనక్కర్లేదు ఎప్పుడు వాగులు పొంగి పొర్లుతాయో తెలియదు నాలుగైదు రోజులు వర్షాలు కురిస్తేచాలు వరద నీరు చుట్టుముడుతుంది ఇదంతా ఎక్కడో కాదు వరంగల్‌ ఏజెన్సీలోని పరిస్థితి.

కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో వరంగల్‌ ఏజెన్సీలో కొండ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. బతుకుదెరువు కోసం అడవిలోకి వెళ్లిన గిరిజనులను ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టింది. ఒకవైపు వరద నీరు మరోవైపు వాగులు ఉగ్రరూపం దాల్చడంతో గిరిజనుల గుండె ఆగినంతపనైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వరద నీటిలో చిక్కుకుపోయారు. ఇంటికెళ్లే దారిలేక రెండు మూడ్రోజులపాటు నరకయాతనపడ్డారు.

వరంగల్‌ ఏజెన్సీ వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆదివాసీలు ఇంటికెళ్లేందుకు సతవిధాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఇంటికెళ్లాలంటే వాగు దాటాల్సి రావడంతో ఓ గిరిజనుడు సాహసం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు 50 గంటలు నరకయాతన తర్వాత ఎలాగైనా ఇంటికెళ్లాలన్న ఆశతో వాగులోకి దూకాడు. నానాతంటాలు పడి వాగులో సగం దూరం వరకు వచ్చాడు. అయితే, ఒక్కసారిగా వాగులో వరద ప్రవాహం పెరగడంతో ఏం చేయాలో దిక్కుతోచక, వాగు మధ్యలో ఆగిపోయాడు. ముందుకెళ్లలేక వెనక్కెళ్లలేక నీటిలోనే కొట్టుమిట్టాడాడు. అంతలోనే దేవుడిగా ఓ ఎద్దు వరద నీటిలో కొట్టుకొచ్చింది. అంతే ఎద్దు తోక పట్టుకున్న ఆ గిరిజనుడు చాకచక్యంగా వాగు దాటాడు. ఎద్దు తోక పట్టుకుని వాగును దాటి ప్రాణాలు కాపాడుకున్న ఘటన స్థానికంగా సంచలనమైంది. ఎద్దు తోక పట్టుకుని వాగు దాటిన వీరయ్యను స్థానికులు సాహసవీరుడిగా కొనియాడుతున్నారు.

వరంగల్‌ ఏజెన్సీలో మారుమూల గ్రామమైన ముత్తారం గిరిజనులు తమ పశువులు, మేకలను మేత కోసం అటవీ ప్రాంతానికి తరలిస్తుంటారు. ఈనెల 6న ఎప్పటిలాగే తాటి ఎర్రయ్య, బొగ్గుల లక్ష్మయ్య, తాటి మల్లయ్య, తాటి పెంటమ్మ, బాడిశ కన్నమ్మలు దాదాపు వందకుపైగా మూగజీవాలను మేత కోసం అడవికి తరలించారు. అయితే, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించడంతో అడవిబిడ్డలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆవతలివైపే ఉండిపోయారు.

ఎద్దు తోక పట్టుకుని వాగు దాటి ప్రాణాలు కాపాడుకున్న వీరయ్య ఇంకా నలుగురు వరద నీటిలో చిక్కుకున్నారంటూ గ్రామస్తులకు చెప్పడంతో వాళ్ల కోసం వాగులు వంకలు కొండల్లో గాలించారు. అయితే, వాళ్ల జాడ కనిపించకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో వాగు దాటే ప్రయత్నంలో కొట్టుకొనిపోయి ఉంటారని అనుమానించారు.

Full View 

Tags:    

Similar News