వక్ర ఉపాధ్యాయుడు‌.. విద్యార్థినిపై వేధింపులు

Update: 2019-08-20 10:04 GMT

అతనో లెక్చరర్ విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సినోడు కానీ అతనే గాడి తప్పాడు. బుద్ది గడ్డి కరిచి పాఠాలు కాకుండా సరసాలు మొదలుపెట్టాడు. ఇతగాని వేధింపులను ఏ స్థాయికి చేరాయంటే ఏకంగా ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చిన స్టూడెంట్‌ను కూడా వదిలిపెట్టలేదు. పరీక్షరాస్తుందన్న మినిమం కామన్‌సెన్స్‌ లేకుండా విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

కరీంనగర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వెంకటేష్‌ కీచక పర్వానికి తెరలేపాడు. మరో కాలేజ్‌ నుంచి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పట్ల వక్రబుద్దిని చూపించాడు. ఇన్విజిలేటర్ అన్న సంగతి మరిచిపోయి పరీక్ష రాస్తున్న అమ్మాయి పట్ల కంత్రీబుద్దిని చూపించాడు. అమ్మాయి బాగుందని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోన్‌ నెంబర్‌ కావాలని వేదించాడు. లెక్చరర్‌ వెకిలిచేష్టలపై ఆ కాలేజ్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్ధులు మండిపడ్డారు.

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్‌ మ్యాటర్‌ను తెలుసుకున్న విద్యార్ధులు కామాంధుడి తాటా తీశారు. అమ్మాయితో నీచంగా ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సదరు లెక్చరర్‌ తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్యాక్టల్టీని అదుపులోకి తీసుకున్నారు.

Full View 

Tags:    

Similar News