2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటిస్తాం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని.

Update: 2019-12-25 05:05 GMT
కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని. ఇదే సందర్భంగా ఈ నెల 18న హైదరాబాద్‌లో కృత్రిమ మేధపై రౌండ్‌టేబుల్‌ సదస్సును నిర్వహించామని కేటీఆర్ ఒక సమావేశంలో తెలిపారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖులు హాజరయ్యారన్నారు. ఈ సమావేశంలో ఏఐ ఉపయోగం, అభివృద్ధి మార్గదర్శకాలు, ప్రోత్సాహకాలు ఇతర అంశాల పై చర్చించామన్నారు. దీనికి అనుగుణంగా పనిచేసే విధానాల రూపకల్పనను  చేసారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, నిపుణుల సమక్షంలో 2020 సంవత్సరాన్ని జనవరి రెండో తేదీన కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించనున్నారన్నారు. ఈ సదస్సుకు ప్రముఖులు హాజరుకానున్నారు. వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి వాటిని వెల్లడిస్తామని తెలిపారు. పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడంతో పాటు ప్రాజెక్టులను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఏడాది పొడవునా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను కూడా అదే రోజున వెల్లడించనున్నామన్నారు. అదే రోజు ప్రోత్సాహక విధానాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు.

ప్రస్తుత సమాజంలో సమాచార సాంకేతికతలో కృత్రిమ మేధ విప్లవాత్మకమైనదిగా గుర్తింపు పొందిందని. ఇప్పటికే డ్రోన్‌, బ్లాక్‌వైన్‌ సాంకేతికతలకు ప్రత్యేక విధానాలను ప్రకటించిన ప్రభుత్వం అదే తరహాలో కృత్రిమ మేధకు గుర్తింపు ఇవ్వనుందని తెలిపారు. ఇదే కోణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే దశాబ్బాన్ని స్వాగతం పలకనుంది. రోబోటిక్స్‌, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డ్రోన్‌, బ్లాక్‌చైన్‌ సాంకేతికతలను వివిధ రంగాల్లో అమలు చేస్తోందని తెలిపారు.



Tags:    

Similar News