Iron Man Honest: ఇస్త్రీ బట్టల్లో రూ.5 లక్షల బంగారం..

Iron Man Honest in Nalgonda: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా 10 రూపాయలు దొరికితే ఏం చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా, రెండో మనిషికి కూడా తెలియకుండా దాచుకుంటారు.

Update: 2020-06-29 07:44 GMT

Iron Man Honest: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా 10 రూపాయలు దొరికితే ఏం చేస్తారు. గుట్టుచప్పుడు కాకుండా, రెండో మనిషికి కూడా తెలియకుండా దాచుకుంటారు. కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డ దారులు తొక్కే వారున్న ఈ సమాజంలో ఓ జంట మాత్రం వారికి దొరికిన 5లక్షల రూపాయలను తమ యజమానికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలం, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన కేతరాజు మంజుల–నర్సింహ దంపతులు దుస్తులు ఉతుకుతూ, ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అందులో భాగంగానే మంజుల చౌటుప్పల్‌లోని తంగడపల్లి రోడ్డులోని మారుతీనగర్‌ కాలనీకి చెందిన లక్ష్మి–భద్రారెడ్డి ఇంట్లో ఈనెల 26న దుస్తులు ఉతికింది. ఆ తరువాత ఇంటి యజమానురాలు లక్ష్మి, మంజులకు ఇస్త్రీ కోసం కొన్ని దుస్తులను ఇచ్చింది. తన వృత్తిలో భాగంగా ఆదివారం ఉదయం ఆమె దుస్తులను ఇస్త్రీ చేయడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో యజమాని ప్యాంటు జేబులో బాక్సును గుర్తించింది.

అసలు ఆబాక్సులో ఏముందో చూద్దాం అని తెరిచి చూసింది. అందులో 10 తులాల బంగారం కనిపించడంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని కౌన్సిలర్‌ ఆలె నాగరాజుకి, సేవా సంఘం అధ్యక్షుడు ఎంవీ చారికి తెలిపారు. దీంతో స్పందించిన నాగరాజు ఆ విషయాన్ని పోలీసులకు తెలిపి వారిని తీసుకొని లక్ష్మీ ఇంటికి వెళ్లారు. బాక్సులో ఉన్న బంగారు నగలను మంజుల యజమానురాలు లక్ష్మికి అప్పగించారు. అనంతరం 5 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఎంతో నిజాయితీగా అప్పగించేందుకు ముందుకు వచ్చిన మంజుల –నర్సింహ దంపతులకు ఎస్సై నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించా రు. బట్టలుపెట్టి, బహుమతి అందజేశారు. 

Tags:    

Similar News