ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిజాయితీ: దొరికిన పర్సును తిరిగి ఇచ్చాడు..

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిజాయితీ: దొరికిన పర్సును తిరిగి ఇచ్చాడు..
x
Highlights

ఈ కాలంలో నీతి, నిజాయితీగా ఉండేవారు కరువాయ్యారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లోకం స్వార్ధంతో పరుగులు తీసుస్తోంది కనుక. ఈరోజుల్లో పరుసు దొంగిలించే వాళ్లు ఉంటారు.. కానీ పరుసు పోగొట్టుకుంటే.. దాన్ని మళ్లీ తిరిగి తెచ్చే వాళ్లు ఎంతమంది ఉంటారు? చెప్పండి.

ఈ కాలంలో నీతి, నిజాయితీగా ఉండేవారు కరువాయ్యారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లోకం స్వార్ధంతో పరుగులు తీసుస్తోంది కనుక. ఈరోజుల్లో పరుసు దొంగిలించే వాళ్లు ఉంటారు.. కానీ పరుసు పోగొట్టుకుంటే.. దాన్ని మళ్లీ తిరిగి తెచ్చే వాళ్లు ఎంతమంది ఉంటారు? చెప్పండి. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం అందరి లాగా కాకుండా పర్సు పొగొట్టుకున్న వ్యక్తికి తిరిగి పర్సును ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ కార్ఖానా జంక్షన్‌లో సుక్రిత్ అనే వ్యక్తి తన పర్సును పోగొట్టుకున్నాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నా మారేడుపల్లి ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌కు పర్సు దొరికింది.

పర్సులో ఉన్న ఆధార్ కార్డు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, ఒరిజినల్ ఆర్‌సీల ఆధారంగా సుక్రిత్‌కి సమాచారం అందించాడు. పర్సును ట్రాఫిక్ సీఐ దస్రూకు అందజేశారు. శుక్రవారం సుక్రిత్‌కు సీఐ సమక్షంలో పర్సును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ దస్రూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పర్సు బాధితుడు సుక్రిత్ మాట్లాడుతూ నా పర్సు పోయింది అనుకున్నా కానీ నా అడ్రస్ ప్రూఫ్‌తో తనకు కాల్ చేసి పర్సును అందించిన పోలీసు సిబ్బందికి ధన్యవాదములు తెలిపాడు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలోకి ఎక్కింది. దీంతో ఇప్పుడు ఈ వార్త తెగ చక్కర్లు కొట్టడమే కాకుండా కానిస్టేబుల్ నిజాయితీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories