మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ ఫైన్.. ఎందుకో తెలుసా?

ఈ ప్లెక్సీలు బ్యానర్ల కారణంగా ఇప్పటి వరకూ అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది.

Update: 2020-02-15 12:49 GMT

ఈ ప్లెక్సీలు బ్యానర్ల కారణంగా ఇప్పటి వరకూ అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది. నగరంలో అనధికారికంగా పెట్టే ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాట్లను నిషేధించిందించి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే వారికి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ గతంలో అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. పర్యావరణాన్ని కాపాడడంలో ఇదీ ఒక భాగమేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారికి జరిమానాలు విధించాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని కూడా ఆయన గతంలో చెప్పారు.

ఇక పోతే ఈ రూల్ ని పాటించకుండా హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ అదికారులు కన్నెర్ర జేసారు. అధికార పార్టీ మంత్రి అయినప్పటికీ ఆయను ఏకంగా రూ.5వేలను జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. జీహెచ్ ఎంసీ అధికారులు గతంలో ఫ్లెక్సీల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినా ఆ మాట లెక్క చేయకుండా, అధికారుల అనుమతి లేకుండా కొన్నిచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అధికారులు మంత్రికి ఫైన్ వేశారు. 

Tags:    

Similar News