బయో డీజిల్ పరిశ్రమలో భారీ ప్రమాదం..

ఇటీవలి కాలంలో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు సమీప ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Update: 2020-05-13 11:18 GMT

ఇటీవలి కాలంలో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు సమీప ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనను మరవకముందే తెలంగాణలోని కొమురంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ పేపర్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు ఘటనలు మరచిపోకముందే ఈ రోజు తెలంగాణలో మరో ఘటన చోటు చేసుకుంది.

పూర్తివివరాల్లోకెళితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా సమాపంలో ఉన్న స్కంద బయోడీజిల్ అనే కర్మాగారంలో ఓ రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరికొంత మంది కార్మికులు గాయపడ్డారు. ఘటన గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బంధికి సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో భద్రతా ప్రమాణాల పాటించే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News