పదకొండేళ్లుగా దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్నాడు: ఆది శ్రీనివాస్‌

కొంత కాలంగా టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-02-12 11:26 GMT

కొంత కాలంగా టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 10వ తేదీన ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

కాగా ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ కీలక వాఖ్యలు చేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటే ఆ పాస్ పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్‌ పేర్కొన్నాడు. చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ఇప్పటికే మూడు సార్లు స్పష్టం చేసిందని తెలిపారు. అయినప్పటికీ ఆయన నియోజక వర్గ ప్రజలకు, దేశాన్ని 11 ఏళ్ల నుంచి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ ఎన్నోసార్లు కోర్టు ఆయనను హెచ్చరించినప్పటికీ ఆయన మారలేదని, ఆయనకు బుద్ధి రాలేదని శ్రీనివాస్ అన్నారు.

సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొందిన వివాదంలో చెన్నమనేని కూరుకుపోయాడని స్పష్టం చేసారు. అలాంటి వ్యక్తికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏవిధంగా టికెట్‌ ఇచ్చిందని పార్టీపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన చేసిన మోసాలను ఒప్పుకుని వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News