ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది: భట్టి విక్రమార్క

ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని తెలంగాణ విపక్ష నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. ములుగు శాసన సభ్యురాలు సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు.

Update: 2019-09-01 12:30 GMT

ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కైన ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని తెలంగాణ విపక్ష నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. ములుగు శాసన సభ్యురాలు సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పలువిభాగాలను కాంగ్రెస్ నేతలు సందర్శించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఆసుపత్రి పర్యవేక్షణాధికారి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.

టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. 

Tags:    

Similar News