బాలామృతం ప్లస్‌ పథకం ప్రారంభం

Update: 2019-12-16 09:02 GMT

తెలంగాణ రాష్ట్రంలోని చిన్నపిల్లలు, మహిళలు ఆరోగ్యంతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసింది. ఈ పథకాల వలన చాలా మంది తల్లులు, పిల్లల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇదే కోణంలో ప్రభత్వం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త పథకాన్ని అమలు చేసింది. పూర్తివివరాల్లోకెలితే వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో బాలామృతం ప్లస్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఆసిఫాబాద్‌, గద్వాల్‌ జిల్లాలో అమలు చేయనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యూనిసెఫ్‌ దక్షిణ రాష్ర్టాల చీఫ్‌ మిషల్‌ రస్డియా, మహిళా - శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, యూనిసెఫ్‌ న్యూట్రిషన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ క్యాతి తివారితో పాటు పలువురు పాల్గొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలు, చిన్నారుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసారు. రాష్ట్ర ప్రజల పట్ల సీఎం ఒక తండ్రిలా వ్యవహరించి వారి భవిష్యత్తుకోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా (ఎన్‌ఐఎన్‌)చేసిన సర్వేలో భాగంగా మహిళలు, పిల్లలు ఉండవలసిన ఎత్తు, బరువు కంటే తక్కువ బరువు కలిగిఉన్నారని చెపుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా అదే విధంగా పుట్టే ప్రమాదం ఉందని సర్వేలో తెలిపారు. ఇలాంటి పోషకాహార లోపాలను గుర్తించిన సీఎం కేసీఆర్ పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలు కష్టపడకుండా ఉండడానికి 6 నెలల పాటు నెలకు రూ.2వేల చొప్పున 12వేల రూపాయలు అందిస్తుంది. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ ల ద్వారా పోషకాహారాన్ని, కావలసిన మందులు కూడా అందిస్తున్నారు.

అంతే కాకుండా అమ్మఒడి వాహనాన్ని కూడా గర్భిణీలు కోసం ప్రవేశపెట్టారు. ప్రసవానంతరం కూడా అదే వాహనం తల్లిని, బిడ్డని ఇంటిచేరుస్తుందని తెలిపారు. పిల్లలకు ప్రతి రోజు బాలామృతం ప్లస్ ను అందించాలిన, ప్రతి తల్లి పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.




Tags:    

Similar News