బ్రేకింగ్ : ప్రగతిభవన్ గేట్లు దూకిన స్టూడెంట్స్..పోలీసులు షాక్‌..

ప్రగతిభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు లోనికెళ్లేందుకు ప్రయత్నం చేశారు.

Update: 2019-10-23 06:31 GMT

ప్రగతిభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు లోనికెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి భద్రతా బలగాల కళ్లు గప్పి ప్రగతిభవన్‌ గేట్లు కూడా ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఇవాళ ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది.

అయితే అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో పోలీసులు షాక్‌ అయ్యారు. 300 మందికి పైగా పోలీసుల భద్రతా వలయాన్ని తప్పించుకుని లోపలికి వెళ్లడం సంచలనంగా మారింది. అయితే అప్పటికప్పుడే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బలవంతంగా లాక్కెళ్లి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 

Tags:    

Similar News