రియల్ హీరో : మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

పంజాగుట్టా సమీపంలో వెంకటరమణమూర్తి, సుధారాణి అనే ఇద్దరు దంపతులు సోమవారం బైక్ పై రాజీవ్ సర్కిల్ నుంచి బేగంపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఇందులో వెంకటరమణమూర్తి కి చిన్న చిన్న గాయాలు కాగా సుధారాణికి నడుముకు , తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2019-09-24 09:13 GMT

ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచంలో ఎవరి స్వార్ధం వారిది... పక్కవాడికి ఏమైతేనేమి మనం బాగుంటే చాలు అనుకునే వాళ్ళు అబ్బో వేల మంది ఉన్నారు. కానీ పక్కావాళ్ళకి సహాయం చేయాలి మనుషులం అన్నాక మనం కూడా కొంచం మానవత్వం చూపించాలని ఇలాంటి వాళ్ళను చూస్తుంటే అనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పంజాగుట్టా సమీపంలో వెంకటరమణమూర్తి, సుధారాణి అనే ఇద్దరు దంపతులు సోమవారం బైక్ పై రాజీవ్ సర్కిల్ నుంచి బేగంపేట వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఇందులో వెంకటరమణమూర్తి కి చిన్న చిన్న గాయాలు కాగా సుధారాణికి నడుముకు , తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తున్నా కానిస్టేబుల్ ప్రభు ఆమెను చేతుల్లో ఎత్తుకుని హస్పిటల్ లో చేర్చాడు.దీనిని చూసిన నెటిజన్లు తమ ఫోనులో ఫోటోలు తీసి రియల్ హీరో అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

Tags:    

Similar News