మీ ఇంట్లో వ్యర్థాలున్నాయా...అయితే మాకు సమాచారం ఇవ్వండి

పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తను, పెరిగిపోతున్న అపరిశుభ్రతను పారదోలేందుకు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.

Update: 2019-11-03 04:10 GMT

పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తను, పెరిగిపోతున్న అపరిశుభ్రతను పారదోలేందుకు వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజు ఇండ్లలో పోగయ్యే చెత్తను ఎప్పటికపుడు వాహణాల్లో తరలిస్తూనే ఉన్నారు. దాంతో పాటు మరో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండ్లలో వుండే వ్యర్థాలను పునర్వినియోగించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.

ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకూ 10డీ సైక్లోథాన్ పేరిట ఇండ్లలో ఉన్న వ్యర్థాలను సేకరించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఏ కాలనీలకు సంబంధించిన చెత్తను సేకరించేందుకు ఆ కాలనీల్లోనే ప్రత్యేకంగా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాడైన పరుపులు, కూలర్లు, డోర్ మ్యాట్లు, ఇంట్లో సంబంధించిన వస్తువులను తమకు సమీపంలో ఉండే కేంద్రాల్లో అందించాలని ప్రజలకు అధికారులు తెలిపారు. వారు ఇచ్చిన వస్తువులను జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది, ఐటీసీ సిబ్బంది వేరుచేస్తారని తెలిపారు. ఇచ్చిన వస్తువులలో వేటినైనా మళ్ళి వినియోగించగలిగే అవకాశం వుంటే వాటిని రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తారు.

ఈ కార్యక్రమాన్ని ముందుగా వెస్ట్ జోన్ పరిధిలో మొదలు పెట్టి తరువాత దశలవారీగా నగరమంతా చేపడతామని వారు తెలిపారు. స్వచ్ఛ పరిసరాల కోసం తాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ఇండ్లలో, కాలనీల్లో వుండే వ్యర్థాలను కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కేంద్రాలకు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు.   

Tags:    

Similar News