Redmi Pad 2 Pro 5G: రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో 5జీ.. జనవరి 8న మార్కెట్లోకి..!
ప్రముఖ షియోమి తన తాజా ట్యాబ్లెట్ Redmi Pad 2 Pro 5Gను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Redmi Pad 2 Pro 5G: రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో 5జీ.. జనవరి 8న మార్కెట్లోకి..!
Redmi Pad 2 Pro 5G: ప్రముఖ షియోమి తన తాజా ట్యాబ్లెట్ Redmi Pad 2 Pro 5Gను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జనవరి 8, 2026న ఈ ట్యాబ్లెట్‌ను అధికారికంగా లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే షియోమి ఇండియా వెబ్‌సైట్‌లో ఈ డివైస్‌కు సంబంధించిన కీలక వివరాలు కనిపించడం టెక్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. లాంచ్‌కు ముందే లభించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Redmi Pad 2 Pro 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. డైలీ యూజ్ నుంచి హెవీ మల్టీటాస్కింగ్ వరకు మెరుగైన పనితీరు అందించడమే లక్ష్యంగా ఈ చిప్‌సెట్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే దీనిలో ఉన్న 12,000mAh బ్యాటరీ దీర్ఘకాలిక బ్యాకప్‌ను ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం విజువల్:
ఈ ట్యాబ్లెట్‌లో 12.1 అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వలన వీడియోలు, సినిమాలు చూడటం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఇక డిజైన్ పరంగా కూడా ఇది ప్రీమియంగా కనిపించనుంది. సుమారు 610 గ్రాముల బరువు, కేవలం 7.5mm మందంతో స్లిమ్‌గా ఉండటం వల్ల దీన్ని సులభంగా క్యారీ చేయవచ్చు.
ఫొటోగ్రఫీ అవసరాలకు ఈ ట్యాబ్లెట్‌లో 8MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఆడియో విషయంలో.. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్లు అందించనున్నట్లు సమాచారం. అంతేకాదు.. మూవీస్ చూడటం, గేమ్స్ ఆడటం, మ్యూజిక్ వినడం కోసం ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
Redmi Pad 2 Pro 5Gను జనవరి మొదటి వారంలో పరిచయం చేయనున్నారు. అమ్మకాలు జనవరి రెండో లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ట్యాబ్లెట్ షియోమి ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్‌లో ధర అంచనా చూసుకుంటే.. 6GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన వై-ఫై వేరియంట్ ధర సుమారు రూ.25వేలు ఉండవచ్చు. మొత్తంగా ఈ ట్యాబ్లెట్ ధరను రూ.20వేల నుంచి రూ.30వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్, భారీ బ్యాటరీ, హై-క్వాలిటీ డిస్‌ప్లే, ప్రీమియం సౌండ్ ఫీచర్లతో Redmi Pad 2 Pro 5G ఈ ఏడాది భారత మార్కెట్‌లో వచ్చే అత్యంత ఆకర్షణీయమైన ట్యాబ్లెట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫీస్ వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని విధాలా ఈ డివైస్ మెరుగైన పనితీరును అందిస్తుంది.