Oppo Find N6: ఒప్పో కొత్త ఫోల్డెబుల్ ఫోన్.. 200MP కెమెరాతో పాటు రెండు 20MP సెల్ఫీ కెమెరాలు..!
ఓప్పో తరచుగా కొత్త ఫోన్లు విడుదల చేస్తూ తన లైనప్ విస్తరిస్తోంది. ఇప్పుడు మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.
Oppo Find N6: ఒప్పో కొత్త ఫోల్డెబుల్ ఫోన్.. 200MP కెమెరాతో పాటు రెండు 20MP సెల్ఫీ కెమెరాలు..!
Oppo Find N6: ఓప్పో తరచుగా కొత్త ఫోన్లు విడుదల చేస్తూ తన లైనప్ విస్తరిస్తోంది. ఇప్పుడు మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ కొత్త డివైస్ పేరు ఓప్పో ఫైండ్ N6 (Oppo Find N6) ఉంటుందని అంచనా. లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ 2026 జనవరిలో ముందుగా చైనాలో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ముఖ్య స్పెసిఫికేషన్లను ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. ఈ లీక్స్ లో కెమెరాలు, డిస్‌ప్లేలు, బ్యాటరీ, పనితీరు గురించి వివరాలు బయటపడ్డాయి. ఈ లీక్స్ ప్రకారం.. ఓప్పో పవర్‌ఫుల్, ప్రీమియం ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
డ్యూయల్ డిస్‌ప్లే సెటప్‌తో హై రిఫ్రెష్ రేట్
ఓప్పో ఫైండ్ N6లో పెద్ద ఫోల్డబుల్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంటుంది. లీక్స్ ప్రకారం.. మెయిన్ స్క్రీన్ 8.12 అంగుళాల LTPO OLED ప్యానల్. ఇది 2K రిజల్యూషన్‌తో స్పష్టమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కవర్ డిస్‌ప్లే 6.62 అంగుళాల సైజులో ఉండవచ్చు. రెండు డిస్‌ప్లేలూ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయవచ్చు. దీంతో స్మూత్ స్క్రోలింగ్, రెస్పాన్సివ్ యానిమేషన్లు లభిస్తాయి. పెద్ద స్క్రీన్ వల్ల పని, వీడియో వ్యూ మరింత మెరుగవుతుంది. ఓప్పో ఫైండ్ N6 ఆండ్రాయిడ్ 16తో వస్తుందని తెలుస్తోంది. ఓప్పో సొంత కలర్‌ఓఎస్ 16 ఇంటర్‌ఫేస్ ఉంటుంది. కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు లభిస్తాయి. మల్టీటాస్కింగ్, ఫోల్డబుల్ స్క్రీన్ ఆప్టిమైజేషన్ మెరుగవుతాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వల్ల కాలక్రమేణా ఉపయోగం మరింత సులభమవుతుంది.
ఓప్పో రెండు హై-క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు ఇవ్వవచ్చు. కవర్ డిస్‌ప్లేలో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలోనూ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. ఫోల్డ్ చేసినా, ఓపెన్ చేసినా స్పష్టమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. వీడియో కాలింగ్ క్వాలిటీ రెండు స్క్రీన్లలోనూ ఒకేలా ఉంటుంది. ఓప్పో ఫైండ్ N6లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా, భారీ 200MP సెన్సార్ ఉండవచ్చు. మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంటుంది. 200MP సెన్సార్ ప్రైమరీదా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ సెటప్ వల్ల వివరమైన ఫోటోలు, అడ్వాన్స్‌డ్ జూమ్ లభిస్తుంది.
ఓప్పో ఫైండ్ N6లో ర్యామ్ 16GB వరకు, స్టోరేజ్ 1TB వరకు ఉండే అవకాశం ఉంది. పవర్ యూజర్లు, కంటెంట్ క్రియేటర్లకు సరిపోతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉండవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్థాయి స్పీడ్, ఎఫిషియెన్సీ లభిస్తుంది. ఓప్పో ఫైండ్ N6లో 6000mAh టిపికల్ బ్యాటరీ ఉండవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్-సెల్ టెక్నాలజీ కలిగి ఉంది. రేటెడ్ కెపాసిటీ 5850mAh (2700mAh + 3150mAh సెల్స్). ఫోన్ రఫ్ గా యూజ్ చేసినా బ్యాటరీ ఒక రోజు నిలుస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ వివరాలు ఇంకా తెలియలేదు. ర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అంచనాలున్నాయి.
డిజైన్, కలర్లు, సెక్యూరిటీ ఫీచర్లు
ఓప్పో ఫైండ్ N6ను టైటానియం, డీప్ బ్లాక్, గోల్డెన్ ఆరెంజ్.. మూడు కలర్లలో లాంచ్ చేయవచ్చు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. త్వరగా, సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. ఓప్పో ఫైండ్ N6 ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తోంది. పెద్ద డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ కెమెరాలు, ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్ కలిసి ఉన్నాయి. అధికారిక వివరాలు లాంచ్ సమీపిస్తున్న కొద్దీ తెలుస్తాయి.