HMD Pulse 2 Pro: హెచ్‌ఎమ్‌డీ కొత్త ఫోన్లు.. ఫీచర్స్ లీక్.. ధర ఎంతంటే..?
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి ఆసక్తి రేపేలా హెచ్‌ఎండి గ్లోబల్ తన కొత్త పల్స్ 2 సిరీస్‌ను సిద్ధం చేస్తోంది.
HMD Pulse 2 Pro: హెచ్‌ఎమ్‌డీ కొత్త ఫోన్లు.. ఫీచర్స్ లీక్.. ధర ఎంతంటే..?
HMD Pulse 2 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి ఆసక్తి రేపేలా హెచ్‌ఎండి గ్లోబల్ తన కొత్త పల్స్ 2 సిరీస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సిరీస్‌లో మూడు మోడల్‌లు వస్తున్నాయి. పల్స్ 2, పల్స్ 2 ప్లస్, పల్స్ 2 ప్రో. అధికారిక లాంచ్‌కు ముందే ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వివరాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా మూడు ఫోన్‌ల్లో ఒకే ప్రాసెసర్ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ పల్స్ 2 సిరీస్ మొత్తం వివరాలను తెలుసుకుందాం.
ఈ మూడు ఫోన్‌ల్లో ఒకే ప్రాసెసర్ వాడుతున్నట్లు పర్‌ఫార్మెన్స్ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా స్పష్టత వచ్చింది. ఇది యూనిసాక్ టైగర్ టి7 250 ప్రాసెసర్. ఇది 12 నానోమీటర్ టెక్నాలజీతో తయారైన చిప్. ఇందులో 2 కార్టెక్స్ ఏ75 కోర్లు 1.82 గిగాహెర్ట్జ్ (GHz) క్లాక్ స్పీడ్‌తో పని చేస్తాయి. అదేవిధంగా 6 కార్టెక్స్ ఏ55 కోర్లు 1.61 గిగాహెర్ట్జ్ (GHz) స్పీడ్‌తో ఉంటాయి. డైలీ యూజ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ కోసం ఈ ప్రాసెసర్ సరిపోతుందని అంచనా.
పల్స్ 2 ప్రో ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. డిజైన్ విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. వెనుక కెమెరా సెటప్ వెడల్పుగా ఉండటం వల్ల ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ ఫోన్ గ్రీన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో లాంచ్ అవుతుందని లీక్‌లు చెబుతున్నాయి. కెమెరా విషయానికి వస్తే ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు కొత్తగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ఈ సెటప్‌తో వైడ్ షాట్స్, గ్రూప్ ఫోటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. డిస్‌ప్లే పరంగా 6.72 అంగుళాల ఐపీఎస్ స్క్రీన్ ఉంది. ఇది 1080పీ ప్లస్ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. వీడియోలు చూడటం, స్క్రోలింగ్ చేయడం స్మూత్‌గా అనిపిస్తుంది. ర్యామ్ ఆప్షన్లు 6 జీబీ, 8 జీబీగా ఉంటాయి. స్టోరేజ్ 128 జీబీ లేదా 256 జీబీగా వచ్చే అవకాశం ఉంది.
పల్స్ 2 ప్లస్ మోడల్‌లో కొంత బ్యాలెన్స్ డిజైన్ కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 720 పీ ప్లస్ అయినా రిఫ్రెష్ రేట్ మాత్రం 120 హెర్ట్జ్ ఇచ్చారు. అంటే గేమింగ్, స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. కెమెరా సెటప్‌లో ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మాత్రమే ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమెరా ఈ మోడల్‌లో లేదు. ప్రాసెసర్, బ్యాటరీ మాత్రం ప్రో మోడల్‌తో సమానంగా ఉంటాయి. అంటే 5000mah బ్యాటరీతో మంచి బ్యాకప్ ఆశించవచ్చు.
పల్స్ 2 ఈ సిరీస్‌లో ఎంట్రీ లెవెల్ మోడల్. ఇందులో కూడా అదే యూనిసాక్ టైగర్ T7 250 ప్రాసెసర్ వాడుతున్నారు. బ్యాటరీ 5000mah. డిస్‌ప్లే 6.7 అంగుళాల సైజ్‌లో 720 పీ ప్లస్ రిజల్యూషన్‌తో 9 0 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. డైలీ యూజ్ కోసం ఈ కెమెరా సెటప్ సరిపోతుంది. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో 4 జీబీ రామ్‌తో ఆండ్రాయిడ్ 15 రన్ అవుతున్న మోడల్ కనిపించింది. గత పల్స్ సిరీస్‌లో 8 జీబీ వరకు రామ్ ఆప్షన్లు ఉండటంతో ఈసారి కూడా హయ్యర్ రామ్ వేరియంట్లు వస్తాయా లేదా అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం మెమరీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని మోడల్‌ల్లో ఎక్కువ రామ్ ఆప్షన్లు ఉంటాయా అనే సందేహం ఉంది.
ఇప్పటివరకు హెచ్‌ఎమ్‌డీ అధికారికంగా లాంచ్ డేట్ ప్రకటించలేదు. ధరల విషయానికీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే లీక్ అయిన స్పెసిఫికేషన్లను బట్టి ఈ ఫోన్‌లు బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది. పల్స్ 2 ప్రో ప్రీమియం ఫీచర్లతో వస్తే, పల్స్ 2 ప్లస్ హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. పల్స్ 2 మాత్రం సాధారణ యూజర్ల కోసం సరైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. అధికారిక లాంచ్ తర్వాత ధరలు బయటకు వస్తే ఈ సిరీస్ మార్కెట్‌లో ఎంత ప్రభావం చూపుతుందో తెలుస్తుంది.