తడబడుతూ.. పాకిస్తాన్ బ్యాటింగ్..

Update: 2019-05-31 10:30 GMT

వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో ఆడుతున్న పాకిస్తాన్ బ్యాటింగ్ లో తడబడుతోంది. పది ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది ఇప్పటివరకూ. 

పాకిస్థాన్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో మూడో ఓవర్లో మొదటి వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌(2) పరుగులకే ఔటయ్యాడు. కాట్రెల్‌ వేసిన మూడో ఓవర్‌ చివరి బంతికి కీపర్‌ చేతికి దొరికిపోయాడు. అక్కడ నుంచి పాక్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడారు. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ఫఖర్‌ జమాన్‌(21), బాబర్‌ అజాం(6) సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, ఆరో ఓవర్‌ ఐదో బంతికి దూకుడుగా ఆడుతున్న ఫఖర్‌ జమాన్‌(22;16 బంతుల్లో 2x4, 1x6) బౌల్డయ్యాడు. రెండు వికెట్లు కోల్పోడంతో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడారు. పదో ఓవర్లో పాకిస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆండ్రీ రసెల్‌ బౌలింగ్‌లో హ్యారిస్‌ సోహైల్‌(8) కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. రసెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Similar News