బాణం ఎక్కుపెట్టనున్న భారత్

ఇన్నేళ్లుగా ఆర్చరీ పోటీలకు దూరంగా ఉన్న భారత్ ఇక మీదట బాణాలను ఎక్కుపెట్టనుంది.

Update: 2020-01-24 07:00 GMT

 ఇన్నేళ్లుగా ఆర్చరీ పోటీలకు దూరంగా ఉన్న భారత్ ఇక మీదట బాణాలను ఎక్కుపెట్టనుంది. ఎన్నికల్లో నెలకొన్న వివాదాల కారణంగా వరల్డ్‌ ఆర్చరీ గతేడాది ఆగస్టు 5న ఏఏఐపై నిషేధం విధించింది. ఇప్పటి వరకూ ఏఏఐపై, ప్రపంచ ఆర్చరీ(డబ్ల్యూఆర్‌) విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా గురువారం ప్రకటించింది. గతవారం ప్రతీఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా ఏఏఐ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

దీంతో టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్ధమవుతున్న భారత ఆర్చర్లకు తీపి కబురు చెవినపడినట్టయింది. కాగా ఏ ఈ ఏడాది జూలై 24 నుంచి జరిగే విశ్వక్రీడల్లో భారతీయులు బాణాలను ఎక్కుపెట్టనున్నారు. ఈ నిషేధాన్ని తొలగించి ఏఏఐకు, డబ్ల్యూఆర్‌ కొన్ని షరతులను విధించింది. అథ్లెట్‌ సభ్యత్వం కోసం నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు పాలనపరమైన సమస్యల పరిష్కారం, వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.



Tags:    

Similar News