నిదానంగా లక్ష్యం వైపు వెస్టిండీస్

Update: 2019-06-06 14:40 GMT

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతుంది. ఆస్ట్రేలియా ఇచ్చిన విజయలక్ష్యం 288 పరుగులను రాబట్టడానికి బ్యాటింగ్ మొదలు పెట్టిన విండీస్ కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ధాటిగా మొదలు పెట్టి నిదానంగా ఆడుతున్నారు విండీస్ బ్యాట్స్ మెన్. ఇప్పటికి పది ఓవర్లు పూర్తయ్యాయి. మెరుపులు లేకుండా రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది విండీస్. ధాటిగా బాట్ జులిపించాలని ప్రయత్నించిన క్రిస్‌ గేల్‌(21; 16బంతుల్లో ) పోరాటం ముగిసింది. స్టార్క్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి గేల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన పూరన్‌ స్వేచ్ఛగా ఆడుతున్నాడు.అతనికి హోప్స్ సహకరిస్తున్నాడు.  

Tags:    

Similar News