గేల్ అదరగొట్టాడు .. కానీ మ్యాచ్ రద్దు

Update: 2019-07-30 09:22 GMT

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్.. గ్లోబల్ టీ 20 కెనడా లీగ్ లో భాగంగా జరిగిన సోమవారం వాన్‌కూవర్‌ నైట్స్‌, మోంట్రియల్‌ టైగర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన వాన్‌కూవర్‌ నైట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో గేల్ ఏకంగా 12 సిక్సర్లు , 7 ఫోర్లతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు . ఈ పరుగులు గేల్ కేవలం 54 బంతుల్లోనే చేసాడంటే గేల్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడి ఉంటాడో మనం అర్ధం చేసుకోవచ్చు .. అయితే వాన్‌కూవర్‌ నైట్స్ నిర్దేశించిన లక్షాన్ని చేధించే అవకాశం మాత్రం దక్కలేదు . భారీ వర్షం రావడంతో మోంట్రియల్‌ టైగర్స్‌ బ్యాటింగ్ కి దిగలేదు .. దీనితో మ్యాచ్ రద్దు అయింది .. 



Tags:    

Similar News