మాజీ ఎంపీ వివేక్‌కు షాక్..

Update: 2019-09-23 05:34 GMT

హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్‌కు చుక్కెదురైంది. వివేక్‌ నామినేషన్ తిరస్కరణకు గురైంది. సుప్రీంకోర్టులో వివేక్‌కు సంబంధించి 'కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్' కేసు ఒకటి పెండింగ్‌లో ఉండటం దానిపై ఇంకా తుది తీర్పు రాకపోవడంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రేసులో వివేక్ లేకపోవడం టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు కలిసిరానుంది. గురువారం ఆయన హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఈ నెల 27న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News