ధోనీని ఆపిన కోహ్లీ!

Update: 2019-07-25 04:20 GMT

ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ అంటే ధోనీ రిటైర్మెంట్. చాలా కాలంగా ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ప్రపంచ కప్ పోటీల అనంతరం ధోనీ క్రికెట్ నుంచి వైదొలుగుతాడని విపరీతంగా ప్రచారం అయింది. కానీ, ధోనీ రెండు నెలలు సెలవు తీసుకుని ఆర్మీలో తన సేవలు అందించడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు ధోనీ దూరంగా ఉన్నాడు.

ఇప్పుడు ఈ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. ధోనీ వరల్డ్ కప్ పోటీలు ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంయ్యాడట. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ దానికి అడ్డుపడ్డాడనేది ఆ వార్త సారాంశం. 2020లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టుకు అందుబాటులో ఉండాలని ధోనీని విరాట్‌ కోరినట్టు తెలుస్తోంది. రిషభ్‌పంత్‌ తొలి ప్రాధాన్య కీపర్‌గా జట్టులో ఉంటాడు. అతడికి ఇబ్బందులు తలెత్తి విశ్రాంతి అవసరమైతే మరొక మంచి కీపర్‌ ఎవరూ ఉండరన్నది కోహ్లీ అభిప్రాయంగా చెబుతున్నారు. మహీ అయితే వెంటనే ఆ కొరత తీరుస్తాడని అతడు భావిస్తున్నాడట. పంత్‌ ఎదిగేందుకు అవసరమైన సాయం ధోనీ చేస్తాడని టీమిండియా యాజమాన్యమూ నమ్ముతోందని చెబుతున్నారు. ఇక కోహ్లీ అయితే, ధోనీకి ఫిట్నెస్ సంబంధిత ఇబ్బందులు లేవు. కాబట్టి జట్టుతో అతను ఉండటం లాభదాయకమని అంటున్నట్టు తెలుస్తోంది. పంత్ తో పాటు ఇంకో వికెట్ కీపర్ ను ఎంపిక చేయాల్సిన అవసరం లేకుండా ధోనీ కొనసాగితే, ఇటు పంత్ కు మార్గదర్శకత్వం తో పాటు, సీనియర్ గా ధోనీ సేవలు జట్టుకు కూడా ఉపయోగపడతాయని ఆలోచనగా తెలుస్తోంది. ఇదే నిజమైతే వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకూ ధోనీ జట్టులోనే ఉంటాదనడంలో సందేహం లేదు. ఇప్పటివరకైతే, ధోనీ రిటైర్మెంట్ వార్తలకు తనకు తానే కామా పెట్టాడు.  

Tags:    

Similar News