15 ఓవర్లకు భారత్ 67/1

Update: 2019-06-27 10:42 GMT

కొహ్లీ బ్యాట్ ఝుళిపిస్తున్నాడు . మరో పక్క కెఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. దీంతో స్కోరు బోర్డులో నిదానంగా పరిగెడుతోంది. థామస్‌ వేసిన పదకొండో ఓవర్లో కోహ్లీ, రాహుల్ ఇద్దరూ చెరో బౌండరీ చేశారు. ఎలెన్ వేసిన పన్నెండో ఓవర్లో చివరి బంతికి కోహ్లీ బౌండరీ సాధించడంతో ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. పదమూడో ఓవర్ హోల్డర్ కట్టుదిట్టంగా వేశాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి రాహుల్ ఎల్బీ అయ్యేట్టుగా కనిపించాడు. కానీ, బాల్ వికేట్లపైనుంచి వెళ్లేట్టు కనిపించింది. ఈ ఓవర్ లో భారత్ కు పరుగులేమీ రాలేదు. అలెన్ వేసిన పద్నాలుగో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. హోల్డర్ విజ్రుమ్భించి బౌలింగ్ చేస్తున్నాడు. తను వేసిన మొదటి ఓవర్లో ఒక్క పరుగూ ఇవ్వని హోల్డర్ ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్ లోనూ ఒక్క పర్గూ ఇవ్వలేదు. దీంతో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు హోల్డర్ వేశినట్టయింది. మొత్తమ్మీద టీమిండియా 15 ఓవర్లు పూర్తయీతప్పటికి ఒక్క వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. రాహుల్ 26 పరుగులతోనూ, కోహ్లీ 21 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.   


Tags:    

Similar News