రబడాని తట్టుకోలేకున్న టీమిండియా

Update: 2019-06-05 14:21 GMT

దక్షిణాఫ్రికా జట్టును కట్టడి చేశామన్న ఆనందం భారత జట్టుకు ఆవిరైపోయింది. నెల మీద పడిన బంతి ఎటువైపు బౌన్స్ అవుతుందో తెలీనంతగా పైకి లేస్తోంది. దీంతో టీమిండియా బ్యాట్సమెన్ ఇబ్బంది పడుతున్నారు. 228 విజయలక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా. చాలా నెమ్మదిగా పరుగులు తీస్తోంది. ఫాస్ట్‌ బౌలర్‌ రబాడ బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో ధావన్ వికెట్ కోల్పోయింది ఇండియా. రబాడ వేసిన 5.1వ బంతికి శిఖర్‌ ధావన్‌ (8; 12 బంతుల్లో) ఔటయ్యాడు. బ్యాట్‌ అంచుకు తగిలిన బంతిని కీపర్‌ డికాక్‌ అందుకున్నాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు. భారత్‌ ఛేదన నిదానంగా సాగుతోంది. మోరిస్‌, రబాడ ధాటికి పరుగులు నామమాత్రంగా వస్తున్నాయి. బంతులు బౌన్స్‌ అవుతున్నాయి. దీంతో కోహ్లీ(4) కూడా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. 11 ఓవర్లకి భారత్‌ 36/1తో ఉంది.

 

 

Tags:    

Similar News