వరుసగా వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో శ్రీలంక

Update: 2019-06-04 11:07 GMT

వరల్డ్ కప్ క్రికెట్ లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక వరుసగా నాలుగు  వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శ్రీలంక కు  22 వ ఓవర్లో గట్టి షాక్ తగిలింది. వరుసగా ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ నబి ఈ ఓవర్లో విజృంభించాడు. నిలకడగా ఆడుతున్న తిరిమన్నే ( 25 ) ను  బౌల్డ్ చేశాడు. తరువాత మెండిస్  రహ్మత్ షా కు క్యాచ్ ఇచ్చి వెనుతిగాడు. ఇక ఓవర్ చివరి బంతికి మాథ్యూస్ కూడా పరుగులు ఏమీ చేయకుండానే రహమత్ షా కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. వరుస వికెట్లు కోల్పోయిన స్థితిలో శ్రీలంక ఆత్మ రక్షణలో పడిపోయింది. 23 వ ఓవర్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది శ్రీలంక కి.. నాలుగు బంతులు ఆడిన డిసిల్వా.. పరుగులేమీ చేయకుండానే హమీద్ హస్సన్ బౌలింగ్ లో మహమ్మద్ షహజాద్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 23 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.


Tags:    

Similar News