నిలకడగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్

Update: 2019-06-05 10:40 GMT

టీమిండియా.. సౌతాఫ్రికా ను పరుగులు చేయకుండా నిలువరిస్తోంది. అయితే, వికెట్లు పడకుండా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసిస్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ను పునర్నిర్మించే పనిలో పడ్డాడు. వెంటవెంటనే వికెట్లు చేజార్చడంతో సఫారీ సారథి డుప్లెసిస్‌ వ్యూహం మార్చాడు. అనవసర షాట్లకు ప్రయత్నించకుండా డుసెన్‌ తో కలిసి చక్కని భాగస్వామ్యం నెలకొలిపే పనిలో ఉన్నాడు. మరో వైపు పాండ్య.. కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 16 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి, 65 పరుగులు చేసింది. 

ఇది విన్నారా?

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 తర్వాత టీమిండియా ఆడిన 26 వన్డేల్లో తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు తీసినప్పుడు 19 మ్యాచులు గెలిచింది.

Tags:    

Similar News