ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ షమి

Update: 2019-06-30 16:09 GMT

జట్టులోకి రావడానికే ఎన్నో తిప్పలు పడ్డ బౌలర్.. వచ్చిన తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ..ఇన్నీ కావు. ఆ బౌలర్ షమి. మొన్న ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లో హ్యాట్రిక్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇది. వరుసగా ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లను పడగొట్టి షాహిద్‌ అఫ్రిదీ సరసన నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌ షమి. వన్డేల్లో మాత్రం భారత్‌ తరఫున వరుసగా మాడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి ఆటగాడు నరేంద్ర హిర్వానీ. అతని తర్వాత షమి మాత్రమే ఉన్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమి కీలక వికెట్లను తీసి భారీస్కోరు చేయకుండా పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేశాడు. పది ఓవర్లు వేసిన షమి.. బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్‌, బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌ను ఔట్‌ చేసి 69 పరుగులు ఇచ్చాడు. షమి వన్డే కెరీర్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే ప్రథమం. ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఐదు వికెట్ల తీసిన ఆరో బౌలర్‌గా షమి రికార్డులో నిలిచాడు.

ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లు:

కపిల్‌ దేవ్‌ (1983)

రాబిన్‌ సింగ్ (1999)

వెంకటేష్‌ ప్రసాద్‌ (1999)

ఆశిష్‌ నెహ్రా (2003)

యువరాజ్‌ సింగ్‌ (2011)

మహ్మద్‌ షమి (2019) 

Tags:    

Similar News