Sachin Tendulkar: సచిన్‌ టెండూల్కర్ కి ప్రతిష్టాత్మక అవార్డు

భారత మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. లారస్‌ స్పోర్టింగ్‌ మొమెంట్‌ 2000-2020 అవార్డును

Update: 2020-02-18 05:39 GMT

భారత మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. లారస్‌ స్పోర్టింగ్‌ మొమెంట్‌ 2000-2020 అవార్డును సచిన సొంతం చేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచినా ఆటగాళ్ళలో సచిన్ ఒకడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో భారత ఆటగాళ్లంతా సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ చూట్టూ తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లారస్‌ స్పోర్టింగ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్‌కు అత్యధిక ఓట్లు రావడంతో అతడిని విజేతగా ప్రకటించారు.

ఈ వేడుకలో టెన్నిస్ లెజెండ్ బ్రోస్ బెకర్ విజేతను ప్రకటించడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా టెండూల్కర్‌కు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. "నా ప్రయాణం 1983 లో నాకు 10 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది. భారత్ మొదటిసారి ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు నాకు దాని ప్రాముఖ్యత అర్థం కాలేదు . అందరూ సంబరాలు చేసుకుంటున్నందున, నేను కూడా పార్టీలో చేరాను అంతే.. ఆ ప్రత్యేకత నా జీవితంలో కూడా జరగాలని అనుకున్నాను . అలా నా ప్రయాణం మొదలైంది. ఇక 2011లో మేం గెలిచినప్పుడు, నా జీవితంలో అదో గర్వకారణమైన సందర్భం. 22 ఏళ్లపాటు నిరీక్షించినా ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో తన తొలి పర్యటనలలో భాగంగా నెల్సన్ మండేలాతో జరిగిన తన సమావేశాన్ని సచిన్ గుర్తుచేసుకున్నాడు. నాకు 19 ఏళ్ళ వయసులో దక్షిణాఫ్రికాలో గొప్ప వ్యక్తిని, అధ్యక్షుడు నెల్సన్ మండేలాను కలిసినందుకు నాకు గౌరవం ఉందని, మండేలా ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు అతను నాయకుడిగా మారడానికి అడ్డుపడలేదు. ఇక నేను గెలిచిన ఈ ట్రోఫీ నా ఒక్కడిదే కాదని మన అందరిదీదని సచిన్ అభిప్రాయపడ్డాడు.


Tags:    

Similar News