రోహిత్ మరో రికార్డ్.. డాన్‌ బ్రాడ్‌మన్‌ సరసన నిలిచాడు!

Update: 2019-10-03 06:40 GMT

సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనింగ్ దిగిన రోహిత్ దుమ్ముదులిపేశాడు. అద్భుత సెంచరీ సాధించి అభిమానులకు పండగ చేశాడు. ఇప్పటివరకూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన రోహిత్ మూడు సెంచరీలు మాత్రమె చేశాడు. తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ సాధించి.. ఓపెనర్ గా తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించిన ధావన్, రాహుల్, ప~ద్వీ షా సరసన నిలిచాడు రోహిత్. అయితే, దానికి మించిన ఘనతను ఇంకోదానిని సాధించాడు ఈ టెస్టులో.

సొంత గడ్డపై అత్యధిక టెస్టు యావరేజ్‌ నమోదు చేసిన ఆటగాళ్లలో డాన్‌ బ్రాడ్‌మన్‌ సరసన చేరి అరుదైన ఘనత సాధించాడు. బ్రాడ్‌మన్‌ తన సొంత గడ్డ ఆస్ట్రేలియాలో మాత్రం 50 ఇన్నింగ్స్‌ల్లో 98.22 సగటు సాధించాడు. ఇప్పుడు ఇదే సగటును స్వదేశంలో రోహిత్‌ నమోదు చేయడం విశేషం. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి సొంత గడ్డపై అత్యధిక యావరేజ్‌ నమోదు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌ చేరాడు. సొంత గడ్డపై ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌ 98.22 టెస్టు సగటుతో 884 పరుగులు సాధించాడు. ఇందులో నాల్గో సెంచరీలతో పాటు ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

Tags:    

Similar News