ఒకే టోర్నీలో కెప్టెన్ గా అత్యధిక పరుగులు : చరిత్ర సృష్టించిన విలియమ్సన్

Update: 2019-07-14 11:24 GMT

వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ లార్డ్స్ లో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు ఏడో ఓవర్లో ఓపెనర్ గుప్తిల్ వికెట్ కోల్పోయింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 557 పరుగులు చేసిన విలియమ్సన్ ఒకే టోర్నీలో ఈ ఫీట్ సాధించిన మొదటి కెప్టెన్ గా రికార్డు సాధించాడు. కాగా, 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి న్యూజిలాండ్ జట్టు ఒక్క వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఓపెనర్ నికోలస్ 40 పరుగులతోనూ, కెప్టెన్ విలియమ్సన్ 24 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.  



Tags:    

Similar News