సెమీఫైనల్ మ్యాచ్ లో వర్షం ఏ సమయంలో రావచ్చంటే..

Update: 2019-07-09 04:47 GMT

వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు వచ్చేసింది. ఇక కొద్ది గంటల్లో మొదటి సెమీ ఫైనల్ టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతోంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈరోజు 11 గంటలనుంచి 12 గంటల వరకూ అక్కడ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా టాస్ వేసే మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్తాయని తెలుస్తోంది. ఇక ఆట జరుగుతున్న సమయమంతా కూడా మేఘాలు ఆవరించుకునే ఉంటాయట. అదేవిధంగా మొదటి ఇన్నింగ్స్ చివరికి వచ్చే సమయంలో అంటే సుమారు సాయంత్రం 6 - 7 గంటల మధ్య చిరు జల్లులు కురిసేందుకు అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇక అటు తరువాత వర్షం భయం ఉండకపోవచ్చనీ.. ఆకాశం మేఘావృతమై ఉండొచ్చనీ అక్యూ వెదర్ అంచనాలు చెబుతున్నాయి. అంటే.. దాదాపుగా మ్యాచ్ కొద్దిపాటి అంతరాయాలతో ఈరోజు జరగడానికి అవకాశాలున్నట్టే అన్న మాట. 

Tags:    

Similar News