India vs South Africa: కోహ్లికి అగ్నిపరీక్ష

ఇటివల న్యూజిలాండ్ లో పర్యటించిన భారత క్రికెట్ జట్టు అయిదు టీ 20 సిరీస్ లో ఆతిధ్య జట్టును క్లీన్ స్వీప్ చేసి, వన్డే, టెస్ట్ సిరీస్ లలో వైట్ వాష్ కి గురైంది.

Update: 2020-03-10 11:10 GMT
virat kohli

ఇటివల న్యూజిలాండ్ లో పర్యటించిన భారత క్రికెట్ జట్టు అయిదు టీ 20 సిరీస్ లో ఆతిధ్య జట్టును క్లీన్ స్వీప్ చేసి, వన్డే, టెస్ట్ సిరీస్ లలో వైట్ వాష్ కి గురైంది. ఇక సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టును ఢీకొట్టబోతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా భారత్ కి చేరుకుంది. ఇరు జట్ల మధ్య సిరీస్ మార్చ్ 12 నుంచి మొదలుకానుంది. మార్చి 12న ధర్మశాల వేదికగా తొలి వన్డే, మార్చ్ 15న లక్నోలో రెండో వన్డే, మార్చ్ 18 న కోల్‌కతాలో మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. అయితే ఇప్పటికే ఈ సిరీస్ కోసం జట్లను ప్రకటించాయి.

కోహ్లికి పరీక్ష...

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ సిరీస్ ఓ పరీక్ష లాగా మిగలనుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20ల సిరీస్‌లో 105 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లి.. ఇక మూడు వన్డే సిరీస్ లోనూ 75 పరుగులు మాత్రమే చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా చేసింది లేదు.. దీనితో ఇప్పుడు కెప్టెన్ గా, ఆటగాడిగా కోహ్లికి ఈ సిరీస్ ఓ అగ్నిపరీక్ష లాగా మిగలనుంది.. ఇక కోహ్లితో పాటుగా ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ రాణించాల్సి ఉంది..ఇక గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం అయిన సంగతి తెలిసిందే..

దక్షిణాఫ్రికా టీమ్ :

డికాక్ (కెప్టెన్, కీపర్), తెంబ బవుమా, దుస్సేన్, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, జెన్నీమన్ మలాన్, జేజే స్మట్స్, జార్జ్ లిండే, పెహ్లూక్వాయో, కైల్ వెర్రియన్నె, హెన్రిచ్ క్లాసెన్, లుంగి ఎంగిడి, లూథో సిపమ్‌లా, హెండ్రిక్స్, ఆన్రిచ్ నోర్తేజ్.

భారత్ టీమ్ :

శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభమన్ గిల్ 

Tags:    

Similar News