కష్టాల్లో పాకిస్థాన్

Update: 2019-06-12 15:43 GMT

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ మరోసారి తమ నిలకడ లేమిని బయటపెట్టుకున్నారు. 25 ఓవర్లకు 136/2తో ఉన్న పాక్ జట్టు 30 వ ఓవర్ వచ్చేసరికి నాలుగు  వికెట్లను వరుసగా చేజార్చుకుంది. మొదట 26 వ ఓవర్ తొలి బంతికి ఇమామ్‌ ఉల్‌ హక్‌(53) వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ తరువాత ఫించ్‌ వేసిన 27ఓవర్‌ ఆఖరి బంతికి హఫీజ్‌(46) వికెట్ కోల్పోయింది. భారీ షాట్‌ ఆడిన హఫీజ్‌ బౌండరీలైన్‌ వద్ద స్టార్క్‌ చేతికి చిక్కాడు. ఆపై క్రీజులోకి వచ్చిన మాలిక్‌(0)ను ఖాతా తెరవకుండానే కమిన్స్‌ పెవిలియన్‌కు పంపాడు. 30 ఓవర్ లో  రీచర్డ్సన్ బౌలింగ్ లో అసిఫ్ ఆలీ (5 ) కారే కు క్యాచ్ ఇచ్చి వెనుతిగాడు.  దీంతో 30 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 160  పరుగులు చేసి పాక్ కష్టాల్లో పడింది. విజయానికి ఇంకా 148  పరుగులు అవసరం కాగా, నాలుగు వికెట్లు మాత్రమె చేతిలో ఉన్నాయి. 

Tags:    

Similar News