పోరాడిన కివీస్.. పాకిస్తాన్ విజయలక్ష్యం 238

Update: 2019-06-26 14:24 GMT

వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో నషీం, గ్రాండ్ హోం పోరాటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. 15 ఓవర్లలో నలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నషీం, విలియమ్సన్ ఆదుకున్నారు. అయితే, చక్కగా కుదురుకున్నవిలియమ్సన్‌(41; 69బంతుల్లో) ఇన్నింగ్స్ 27 వ ఓవర్లో షాదాబ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ మళ్లీ కష్టాల్లో పడింది. తరువాత నషీంకు గ్రాండ్‌హోమ్‌ జత కలిశాడు. అక్కడ నుంచి ఇద్దరూ ఆచి, తూచి ఆడుతూ వికెట్ పడకుండా చూసుకుంటూనే పరుగులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మొదట నషీం తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో 40 వ ఓవర్ ఐదో బంతికి సింగిల్‌ రాబట్టి నషీం 50 పరుగులు పూర్తీ చేసుకున్నాడు. తరువాత 45 వ ఓవర్ మూడో బంతికి ఆమిర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ రాబట్టి గ్రాండ్‌హోమ్‌ కూడా తన అర్థ సెంచరీ మార్కును చేరుకున్నాడు. పట్టుదలతో ఇద్దరూ బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను కాపాడారు. 64 పరుగులు చేసిన గ్రాండ్‌హోమ్ వాహబ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని షాట్‌ ఆడి.. లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు ఆరు వికెట్లకు 217 పరుగులు. తరువాత వచ్చిన శాంటర్న్‌(5) కలిసి నషీం(97) జట్టు స్కోరును 237 పరుగులకు చేర్చాడు. మొత్తమ్మీద పాకిస్తాన్ న్యూజిలాండ్ ను కట్టడి చేయడంలో సఫలం అయింది. ఇపుడు 238 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఎలా చేదిస్తుందనేది ఆసక్తికరం.

Tags:    

Similar News