పాకిస్థాన్ 300 దాటింది..

Update: 2019-06-03 12:46 GMT

ఎక్కడా తొణక్కుండా పాకిస్థాన్ బ్యాటింగ్ సాగుతోంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఆచి, తూచి ఆడుతున్న పాక్ బ్యాట్స్ మెన్ ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. వికెట్ పడిన ప్రతిసారి నెమ్మదించి.. మల్లి విజృంభించి.. చక్కని భాగస్వామ్యాలను నెలకొల్పుతూ ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్నారు పాక్ బ్యాట్స్ మెన్. సర్ఫరాజ్ సహకారం తో శతకం వైపు సాగుతున్న హఫీజ్ మార్క్‌వుడ్‌ వేసిన 42.4వ బంతిని లాంగాఫ్‌లో కి అడగా.. క్రిస్‌వోక్స్‌ గాల్లోకి డైవ్‌ చేసి బంతిని అందుకున్నాడు. దీంతో హఫీజ్ చక్కని ఇన్నింగ్స్ కు తెరపడింది. హఫీజ్ 62 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తర్వాత సర్ఫరాజ్ కు అలీ తోడయ్యాడు. 45 ఓవర్లు ముగిసేసరికి 297  పరుగులు చేసిన పాకిస్థాన్.. 46  వ ఓవర్  మూడో  బంతికి 300 మార్కును చేరుకుంది. 

Tags:    

Similar News