చెలరేగిన విండీస్ బౌలర్లు.. పాక్ 105 ఆలౌట్

Update: 2019-05-31 11:24 GMT

వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఈరోజు పాకిస్తాన్ వెస్టిండీస్ తో

తలపడుతోంది. టాస్ ఓడిపోయిన పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ

క్రమంలో వెస్టిండీస్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ చాపచుట్టేశారు.

ఏ దశలోనూ విండీస్ బౌలర్లను ఎదుర్కోలేక బ్యాతులేత్తేశారు.

కట్టుదిట్టం గా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు పాక్ బ్యాట్స్ మెన్ ను

కుడురుకోనివ్వకుండా దెబ్బ మీద దెబ్బ తీశారు. మొదట రస్సెల్ (2

వికెట్లు) పాక్ పతనానికి బీజం వేశాడు. తరువాత హోల్డర్ (3 వికెట్లు)

దానిని కొనసాగించాడు. వారిద్దరికీ థామస్ (3 వికెట్ల) తోడవడంతో

ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు కూడా ఆడటానికి ఆపసోపాలు పడ్డారు

పాక్ బ్యాట్స్ మెన్. 21.4 ఒవర్లలో 105 పరుగులు మాత్రమే చేయాగాలిగారు. వెస్టిండీస్ విజయలక్ష్యం 106 పరుగులు. 

 ప్రపంచకప్‌లో పాక్ రెండో అత్యల్ప స్కోరు ఇది. 1992లో ఇంగ్లాండ్‌పై 74 పరుగులకే ఆలౌటైంది. 

Similar News