మొదటి వికెట్ పడింది!

Update: 2019-06-16 14:47 GMT

337 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ ఓపెనర్లు ఆచి, తూచి ఆడుతున్నారు. ఇండియా బౌలర్లు చక్కని బంతులేస్తున్నప్పటికీ.. పాక్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. మొదటి ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తరువాతి ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో జమాన్ ఒక బౌండరీ సాధించాడు. మూడో ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్ లో ఇమాం హాక్ ఒక బౌండరీ సాధించాడు. నాలుగో ఓవర్ లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగారు పాక్ బ్యాట్స్ మెన్. ఐదో ఓవర్ భువనేశ్వర్ బౌలింగ్ లో పాక్ ఓపెనర్ ఇమామ్ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఓవర్ లో ఐదో బాల్ వేస్తున్న సమయంలో కాలికి గాయం అయింది. దీంతో భువీ ఫీల్డ్ విడిచి వెళ్లాల్సి వచ్చింది. వెంటనే ఓవర్ పూర్తి చేయడానికి వచ్చిన విజయ్ శంకర్.. ఇమామ్ ఉల్ హక్ ను అవుట్ చేశాడు. 18 బంతుల్లో 7 పరుగులు చేసిన హక్ ఎలిబీడబ్లయూ గా దొరికిపోయాడు. తరువాతి బంతికి శంకర్ ఒక్క పరుగు ఇచ్చాడు. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ ఒక్క వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. బాబర్ ఆజం, ఫేకర్ జమాన్ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News